వైఎస్ షర్మిల మండిపాటు...! 20 h ago
AP : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు చేసారు. ‘చంద్రబాబు గారు… మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే… ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తుందని హేళన చేసారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా హమీలపై మోసాలను నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తుందని షర్మిల అన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం, పారిశ్రామిక కారిడార్ల స్థాపన, 10 ఏళ్లు దాటినా కదలని పోలవరం, కడప స్టీల్ ప్లాంటు, విశాఖ ఉక్కు రక్షణ అన్ని హామీలను తొక్కిపెట్టేసి మీరు ప్రజలకు చేసింది ఎమిటి అని నిలదీశారు.